సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ మహాధర్నా

-

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది.  సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో నిరసనలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి కార్మికులు అనేకసార్లు కోరినప్పటికీ.. కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చిందని కేటీఆర్ అన్నారు. వేలం లేకుండా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటీకరణ చేయబోమని మాటిచ్చి నిలుపుకోలేక పోయిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణను తెరపైకి తెస్తోందని కేటీఆర్ ఆరోపించారు. లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం… సింగరేణిని సైతం అమ్మాలని చూస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news