కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. శేలు దప్పినోడు శేను వెడ్తె… వడగండ్ల వానొచ్చి పోయిందని… 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రూ.15 వేలు రాకపాయె అంటూ చురకలు అంటించారు. రుణమాఫీ రూ.2 లక్షలు కాకపాయె అంటూ ఆగ్రహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
24 గంటల ఉచిత కరంటు మాయమాయె… పంటల కొనుగోళ్లు చెయ్యకపాయె అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యకపాయె అంటూ ఆగ్రహించారు. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే… భస్మాసుర హస్తం కాటేస్తుంది… జాగో తెలంగాణ అంటూ కాంగ్రెస్ సర్కార్ పై మండిపడారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.