6 ఏళ్ల వయసులో టీచర్ అవమానించిందని…. 30 ఏళ్ల తరువాత పగ తీర్చుకున్న స్టూడెంట్

-

ప్రైమరీ స్కూల్ లో ఉన్న సమయంలో టీచర్ అవమానించదనే కారణంతో దాదాపు 30 ఏళ్ల తరువాత ఆ టీచర్ ను దారుణం చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బెల్జియం జరిగింది. తను హత్య చేసిన పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ తన స్నేహితుడికి ఓ రోజు హత్య గురించి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… బెల్జియం దేశంలోని ఆంట్‌వెర్ప్ సమీపంలోని హెరెంటల్స్‌లో 59 ఏళ్ల వెర్లిండెన్ ను 2020లో క్రూరంగా హత్య జరిగింది. 101 సార్లు కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు 37 ఏళ్ల గుంటేర్ ఉవెంట్స్. అయితే పోలీసులు ఈ హత్య గురించి ఎంతగా ప్రయత్నించినా.. వందలాది డీఎన్ఏలను విశ్లేషించిన హంతకుడిని కనుగొనలేకపోయారు. హత్య సమయంలో అక్కడ ఓ పర్సులో ఉన్న డబ్బును హంతకుడు ముట్టలేదు. దీంతో ఇది దోపిడీకి సంబంధించిన హత్యకాదని.. ప్రతీకారం కోసమే హత్య చేసి ఉంటారని నిర్థారణకు వచ్చారు బెల్జియం పోలీసులు. 

హత్య జరిగిన 11 నెలల తరువాత ఉవెంట్స్ ఓ సారి హత్య గురించి తన స్నేహితుడికి చెప్పడంతో.. అతను పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో హంతకుడు ఉవెంట్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే హతురాలు మరియా వెర్లిండెన్ ను చంపింది ఆమె స్టూడెంట్ అని తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. 1990లో తాను ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న సమయంలో ఆరేళ్ల వయసున్నప్పుడు తనను వెర్లిండెన్ తీవ్రంగా అవమానించిదని అందుకే చంపానని చెప్పాడు హంతకుడు ఉవెంట్స్. ప్రస్తుతం నేరాన్ని అంగీకరించాడు ఉవెంట్స్. అయితే ఉవెంట్స్ నిరాశ్రయులకు సహాయం చేసే గొప్ప క్రైస్తవ భక్తుడంటూ.. అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news