ఖమ్మంలో విషాదం..ఆస్తి కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా చంపాడు !

-

ఆస్తి కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా చంపాడు. ఈ సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా గోపాల పేటలో పిట్టల వెంకటేశ్వర్లుకు దివ్యాంగు రాలు అయిన తల్లి పిచ్చమ్మ(60), కూతుళ్లు నీరజ(11), ఝాన్సీ(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య కనకదుర్గ చనిపోయారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇల్లు, ఎకరం పది గుంటల పొలంలో సగం ఇద్దరు పిల్లలకు దక్కేలా పెద్దల సమక్షంలో ఒప్పందం రాసుకున్నారు.

brutally klled mother and two daughters for property

కాగా వెంకటేశ్వర్లు తల్లాడకు చెందిన త్రివేణిని రెండో వివాహం చేసుకొని పిల్లలను, తల్లిని వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టాడు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా చెడు వ్యసనాలతో అప్పులపాలయ్యాడు వాటిని తీర్చేందుకు తల్లి పిచ్చమ్మ పేరున ఉన్న దాదాపు అరెకరం పొలాన్ని అమ్మాలంటూ అప్పుడప్పుడు వచ్చి గొడవపడేవాడు. మనవరాళ్ల భవిష్యత్తు దృష్ట్యా అమ్మేది లేదంటూ ఆమె నిరాకరిస్తూ వచ్చింది. దీంతో ఆస్తి కోసం ముగ్గురినీ అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నీ.. ఫోన్ చేసి కూతురితో ఇంటికి వస్తున్నానని చెప్పి, అర్ధరాత్రి ఇంటికి వచ్చి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లనూ చంపేసి పరారయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news