అది నోరా లేక డ్రైనేజీ నా..బ్రోకర్‌ సాయి – గోరంట్ల బుచ్చయ్య

-

అది నోరా లేక డ్రైనేజీ నా..బ్రోకర్‌ సాయి అంటూ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్‌ లో గోరంట్ల బుచ్చయ్య ఫైర్‌ అయ్యారు. ‘గడ్డం’గీక్కునే బ్లేడ్ పై 28 శాతం నుండి 18% శాతం జిఎస్టీ తగ్గించింది కేంద్రం…ఆలాగే నీ వాగుడు కూడా తగ్గిస్తే మంచిది విషం రెడ్డి! అంటూ సెటైర్‌ వేశారు. నీకు ఎలాగో ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశం లేదు కానీ ని అల్లుడు ఎల్జీ పాలిమర్స్ తరుపున ఇస్తానని చెప్పిన కోటి రూపాయలు సంగతి ఏంటి రెడ్డి? అని నిలదీశారు బుచ్చయ్య చౌదరి.

ఢిల్లీ వెళ్లి స్పెషల్ స్టేటస్ తీసుకురారా అంటే..!ఢిల్లీ వెళ్లి ఉల్లి గెడ్డ తెచ్చి నట్లు ఉంది ని యవ్వారం..ప్రజలకి ఏమి కావాలో అది చెయ్యండి..స్పెషల్ స్టేటస్,ఎల్జీ పాలిమర్స్ ది తేల్చండని ఫైర్‌ అయ్యారు. ఊరంతా వడ్లు ఎండ బెట్టుకుంటే నక్క తోక ఎండ బెట్టుకుంది అంట అలా ఉంది మిస్టర్ బ్రోకర్ వీసా రెడ్డి ని యవ్వారం!వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ లో నువ్వు చేసింది ఏంటి బ్రోకర్ సాయి.20మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు.దాదాపు 500 మంది అభాగ్యులు అయ్యారు.ఇప్పటికి వారికి పరిహారం లేదని ఓ రేంజ్‌ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news