కేంద్ర బడ్జెట్లో జాతీయ సహకార డేటా బేస్‌కు రూ.2,516 కోట్లు కేటాయించారు. ఫిన్‌టెక్ సర్వీసుల కోసం డిజిలాకర్ కేవైసీ మరింత సరళీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రయోగశాలల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
‘5జీ అప్లికేషన్ల తయారీకి 100 ప్రయోగశాలలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభిస్తాం. స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం, రిస్క్ తగ్గించేందుకు కృషి చేస్తాం. క్రృత్రిమ వజ్రాలపై పరిశోధన చేసే ఐఐటీలకు ప్రత్యేక గ్రాంట్లు ఇస్తాం.
క్రృత్రిమ వజ్రాలకు కస్టమ్స్ డ్యూటీ తగ్గింస్తాం. 2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం. ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన పథకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది. ‘ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.