ఎప్పుడూ లేని విధంగా కరువు సీమను వరదలు చుట్టుముట్టాయి. అనంతపురం, చిత్తూర్, నెల్లూర్, కడప జిల్లాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. వరదల కారణంగా ఎంతో మంది తమ ఆత్మీయులన కోల్పోయారు. ఇందులో ఇప్పటికీ కొందిర ఆచూకీ లభించలేదు. వందల సంఖ్యలో పశువులు మృతి చెందాయి.
కాగా.. తాజాగా వరద మృతులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మృతి చెందిన వారికి ఒక్కోక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వెల్లడించారు. వరదల కారణంగా ఏపీలో ఇప్పటి వరకు 34 మంది మరణించారని.. 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు రెస్య్కూ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చనిపోయిన 90 శాతం మందికి పరిహారం అందించామని మంత్రి వెల్లడించారు. వరదల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మంత్రి వెల్లడించారు. 5,33,345 మంది రైతులు నష్టపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.