“బీస్ట్” సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్…లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇచ్చిన ఫ్యాన్స్…

-

నేడు ప్రపంచవ్యాప్తంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఘనంగా విడుదలైంది.ఉదయం నుంచి థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ హంగామా చేశారు.ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు బెస్ట్ సినిమా చూడడానికి థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు.డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్- విజయ్ దళపతి కాంబోలో వచ్చిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.తాజాగా చెన్నై లో విజయ్ దళపతి అభిమానులు బీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

చెన్నైలో బీస్ట్ సినిమా చూసిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించారు విజయ్ దళపతి అభిమానులు. తమిళనాడులో తెల్లవారుజాము నుంచే థియేటర్స్ దగ్గర అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు.ఈ క్రమంలో విజయ్ మక్కళ్ ఇయక్కం తరపున బీస్ట్ సినిమా చూడడానికి వచ్చిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు అభిమానులు.మరోవైపు విరుద్ నగర్ లోని రాజ్యలక్ష్మి, అమృత రాజ్ థియేటర్లలో బీస్ట్ ఎఫ్టీఎఫ్ఎస్ సినిమా కోసం టికెట్స్ తీసుకునే వారికి ఇదే తరహా ఆఫర్ ప్రకటించాయి.బీస్ట్ సినిమా కోసం 5 టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news