టాలీవుడ్ బ్యూటీ కృతిశెట్టికి బంపర్ ఆఫర్ !

-

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కు జంటగా కృతి నటించిన ఉప్పెన సినిమా ఘనవిజయాన్ని అందుకుంది.

ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఈ విజయంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించింది.

అనంతరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టికి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. తమిళ్‌ హీరో కార్తీ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. కార్తీ ప్రస్తుతం చేస్తున్న జపాన్‌ మూవీలో కృతిశెట్టికి బంపర్ ఆఫర్ వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news