బ్లడ్ ఇస్తారా .. ఇంటికొచ్చి .. దండం పెట్టి తీసుకెళ్తారు !

-

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ప్రజలను బయటకు రాకుండా చూసుకుంటుంది. ఏ మాత్రం బండి బయటకు తీసిన డ్రోన్ కెమెరాల ద్వారా సరికొత్త యాప్ ల ద్వారా బండి నెంబర్ కనిపెట్టి ఫైన్ వేస్తున్నారు. ఇటువంటి టైములో బ్లడ్ డొనేట్ చేస్తామంటే మాత్రం నేరుగా పోలీసులు ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ తీసుకెళ్దాం అని అంటున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ఎమర్జెన్సీ నెలకొంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన రక్త కొరత ఏర్పడింది. అత్యవసర రక్త నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ముంచుకొచ్చింది.Blood donation scheme rolled out to more schools in Wales - BBC News అత్యవసర ప్రమాద కేసులు, తలసేమియా.. హిమోఫీలియా బాధితులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల యూనిట్ల రక్తం అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకులో లాక్ డౌన్ కారణంగా రక్త నిల్వలు కనిష్టానికి పడిపోయినట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉండడంతో ముందే మేల్కొని రక్త కొరతను అధిగమించడానికి సైబరాబాద్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

 

ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకు లో రక్తం ఇవ్వాలనుకుంటే తమ్ముడు సంప్రదిస్తే వారి ఇంటికొచ్చి బ్లడ్ బ్యాంక్ వద్ద దింపి తిరిగి ఇంటికి తామే దింపుతామని ప్రకటించారు. రక్తం ఇస్తామంటే చాలు దండం పెట్టి మరి రక్తదాతలను తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. అంత కొరత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రక్త దాతలు బ్లడ్ ఇవ్వాలనుకుంటే 9490617440 – 9490617431కు ఫోన్ చేస్తే చాలు మేమే మీ దగ్గరికి వచ్చి సురక్షితంగా బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇంటికి చేరుస్తామని అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. 

 

Read more RELATED
Recommended to you

Latest news