ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇవాళ కలిశారు. ఈ భేటీలో బండి సంజయ్ ను ప్రత్యేకంగా పలకరించారు ప్రధాని మోడీ. ఇక ఈ భేటీలో భాగంగా జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్ కుమార్.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

‘గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని… దేశంలోని ఓబీసీలంతా మీకు రుణపడి ఉంటారని చెప్పారు బండి సంజయ్. దేశ ప్రజలు ప్రధానిని ఎన్నటికీ మర్చిపోరని సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోతేనే వారి జీవితాలు బాగు పడతాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news