వీడియో : దేశంలోనే తొలిసారి రైలెక్కిన బస్సులు..

-

అప్పుడు విచిత్ర సంఘటనలు చూసినప్పుడు అవాక్కవడం కామనే. అయితే.. దేశంలోనే తొలిసారి జరిగిన ఘటన చూసినప్పుడు సంబ్రమార్చలకు లోనవుతుంటాము.. అయితే.. సాధారణంగా గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు తరలించడం చూస్తుంటాం. అప్పుడప్పుడు అయితే దేశంలో తొలిసారిగా ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో రవాణా చేశారు. బెంగళూరు నుంచి చండీగఢ్ కు ఈ బస్సులను తరలించారు. ఈ బస్సులు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినవి. మొత్తం 300 బస్సులను రైలు మార్గం ద్వారా రవాణా చేశారు.

ఈ బస్సులు బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రైలు మార్గం ద్వారా చాలా చవకగా రవాణా చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను రైల్లో తరలించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news