బిజినెస్ ఐడియా: అదిరే రాబడిని అల్లం సాగుతో పొందండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. మీరు కూడా ఉద్యోగం చేయకూడదని.. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. వ్యవసాయం అంటే ఇష్టమైన వాళ్లు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. పైగా దీని కోసం ఎక్కువ కష్టపడకుండా మంచిగా లాభాలని పొందొచ్చు.

 

ginjjer

మరిక ఇక ఆ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ వ్యాపారానికి మంచిగా డిమాండ్ ఉంది ముఖ్యంగా శీతాకాలంలో ఈ వ్యాపారం బాగుంటుంది. అదే అల్లం ఫార్మింగ్. అల్లం పండించి మీరు మంచిగా లాభాలను పొందవచ్చు. దీని కోసం స్థలం అవసరం అవుతుంది.

కానీ లాభాలు మాత్రం బాగా వస్తాయి. ఈ పంట పండించడానికి పాత పంటల దుంపలను తీసుకొని ఉపయోగిస్తారు. అయితే దీని కోసం మీరు పొలాన్ని రెండు లేదా మూడు సార్లు దున్నాలి. ఆ తర్వాత ఆవు పేడ, ఎరువు వేసి పంటను పండించాలని ఉంటుంది. అల్లం సాగు కోసం మధ్యలో డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవాలి.

అలా చేస్తే నీళ్లు సులువుగా పడతాయి. నీళ్లు కనుక నిలిచిపోయాయి అంటే అల్లం సాగు చేయకూడదు. ఒక హెక్టర్ పొలంలో దాదాపు 2.5 నుండి 3 టన్నుల విత్తనాలు నాటాలి. ఒక హెక్టార్లు అల్లం సాగు చేస్తే 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

అల్లం ధర మార్కెట్లో ఎనభై రూపాయలు పలుకుతోంది. ఒకవేళ యాభై కింద చూసుకున్నా 25 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే మీరు దీని కోసం ఏడు నుండి ఎనిమిది లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముద్ర పథకం ద్వారా లోన్ తీసుకోవచ్చు ఇలా మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టి మంచిగా లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news