బిజినెస్ ఐడియా: వెదురు తో లాభాలే లాభాలు..!

-

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది వ్యాపారాలని చేయడానికి ఇష్ట పడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.

దేశం లో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధార పడి ఉన్నారు చాలా మంది ఉద్యోగాన్ని కూడా కాదనుకుని వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారు. అయితే ఎక్కువ డబ్బులు రావాలంటే సాంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచిది. వెదురు సాగు తో అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. ఇక మరి వెదురు సాగుకు సంబంధించిన వివరాలని చూద్దాం. సంవత్సరం పొడవునా కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వెదురుకి మార్కెట్లో మంచి ధర ఉండడంతో రైతులకు ఆదాయం బాగా వస్తుంది. మీరు ఏదైనా నర్సరీ లో వెదురు మొక్కల్ని కొని వాటిని మీరు నాటొచ్చు.

ఒక హెక్టారు భూమిలో 625 వెదురు మొక్కలని పెంచవచ్చు. నీరు నాటిన రోజు పోసి ఆ నెల అంతా మీరు నీరు ఇవ్వాల్సి వుంది. తర్వాత ఆరు నెలలకి ఒక సారి ఇస్తే చాలు. వెదురు కాండం చాలా పొడవుగా ఎదుగుతుంది మూడు నుండి నాలుగు సంవత్సరాలకి కోతకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇస్తుంది. వెదురుపంట ని గ్రీన్ గోల్డ్ అని కూడా అంటున్నారు. అయితే మీరు ఏదైనా బిజినెస్ చేసి మంచిగా డబ్బులు సంపాదించాలని భావిస్తే వెదురు మొక్కలు నాటి అదిరే లాభాలని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version