బిజినెస్ ఐడియా: లేయర్ కోళ్లతో లాభాలు లక్షల్లో..!

-

చాలా మంది ఉద్యోగాలని వదిలేసుకుని వ్యాపారాలను చేస్తున్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో వ్యాపారంలో చాలా మంది లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనితో వ్యాపారాలపై దృష్టి పెట్టారు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా ని చూడండి.

మీరు సొంత ఊర్లో ఉంటూనే ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రతి నెల ఆదాయం కూడా వస్తుంది. అవసరమైతే ప్రతి రోజు డబ్బు సంపాదించవచ్చు. అదే లేయర్ కోళ్ల పెంపకం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. లేయర్ కోళ్లను పెంచాలంటే చిన్న షెడ్స్ ని నిర్మించుకోవాలి.

1500 కోళ్ల తో షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు అయితే మొత్తం దీని కోసం ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్లేయర్ కోడిపిల్లల్ని కొనుగోలు చేసుకోవాలి ఒక్కొక్క 30 నుండి 35 రూపాయలు ఉంటుంది మీరు ఈ కోళ్ళ కోసం యాభై వేలు కేటాయిస్తే సరిపోతుంది. అలానే ఇతర ఖర్చుల కోసం 8 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది.

పదిహేను వందల కోళ్ల లక్ష్యంతో వ్యాపారం ప్రారంభించాలంటే 10 శాతం ఎక్కువ కొనుగోలు చేయాలి. 20 వారాల పాటు వీటిని పెంచితే గుడ్లు పెట్టే స్థాయికి ఎదుగుతాయి. ఈ కోళ్ల ద్వారా ఏడాదికి నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు వీటి ద్వారా వస్తాయి. హోల్ సేల్ గా ఈ గుడ్లను మూడు రూపాయల చొప్పున అమ్మినా సరే 12 లక్షలు వస్తాయి. ఇలా గుడ్లను అమ్మి నెలకి లక్షకు పైగా సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news