బిజినెస్ ఐడియా: జీలకర్రతో.. నెలకు రూ.60 వేల ఆదాయం..!

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వ్యాపారాలపై దృష్టి పెట్టారు మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు మంచి ఐడియా. దీని ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. జీలకర్ర సాగుతో నెలకి 60 వేలకు పైగా ఆదాయం మీకు వస్తుంది.

ఈ మధ్యన ఎక్కువ మంది వ్యవసాయంపై దృష్టి పెట్టారు వ్యవసాయం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు మార్కెట్లో జీలకర్రకి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి జీలకర్ర సాగు ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. లక్షల్లో ఆదాయాన్ని ఇది తెచ్చి పెడుతుంది. ఔషధ గుణాలు ఉన్న జీలకర్రని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి నష్టం మీకీ రాదు.

గుజరాత్ లోని 80 శాతం జీలకర్రని ఉత్పత్తి చేస్తున్నారు. జీలకర్రని విత్తనానికి మీరు ముందుగా పొలాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకోండి. మట్టి మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. కలుపు మొక్కలు లేకుండా తీసేయండి తేలికగా ఉండే భూముల్లో జీలకర్ర చక్కగా పండుతుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జీలకర్ర పంట చేతికి రావడానికి 120 రోజుల నుండి 125 రోజులు పడుతుంది.

హెక్టర్ కి దాదాపు 30 వేల రూపాయల నుండి 35 వేల వరకు వస్తుంది. ఒక హెక్టార్ కి ఏడు నుండి ఎనిమిది క్వింటాళ్ల జీలకర్ర విత్తనాలు వస్తాయి. జీలకర్ర కిలో 100 రూపాయలు కింద లెక్క పెడితే ఖర్చులన్నీ పోగా మీకు హెక్టార్ కి 50,000 వరకు మిగులుతుంది మీరు దీన్ని ఐదు ఎకరాలలో సాగు చేస్తే రెండున్నర లక్షల ఆదాయం వస్తుంది. నాలుగు నెలలు కనుక దీనిని పండిస్తే రెండున్నర లక్షలు అంటే ఏడాదికి మీకు 60000 వచ్చినట్టే కదా..? ఇలా జీలకర్ర ద్వారా అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news