ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు

-

డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఅర్ కు అవకాశం ఇస్తే సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ స్వేరోలో కొందరికి దోచి పెట్టారని ఆరోపించారు.

స్వేరో లో కొందరికి కాంట్రాక్ట్ లు కట్టబెట్టారని.. స్వేరో తో ప్రవీణ్ కుమార్ దాడులు చేయించారని కీలక వ్యాఖ్యలు చేశారు. పని చేయమంటే… లేని భావాజాలలను స్టూడెంట్స్ లో నింపే ప్రయత్నం అర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారని అన్నారు. గురుకుల విద్య సంస్థల్లో కేసీఅర్ బొమ్మ కూడా పెట్టలేదని మండిపడ్డారు. ప్రవీణ్ కుమార్ IPS గా ఉండి మావోయిస్టులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. బిజెపి కోసం అర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news