బిజినెస్ ఐడియా: సాండ్ విచ్ తో అదిరే లాభాలు.. రెండు, మూడు గంటలు కష్టపడితే చాలు..!

-

ఎక్కువ మంది ఈ మధ్య వ్యాపారాలని ఎంచుకుంటున్నారు. వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు. మీరు కూడా చక్కగా వ్యాపారాన్ని చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ బిజినెస్ ఐడియా ని చూడాలి. ఈ బిజినెస్ ఐడియా ని మీరు ఫాలో అయితే కచ్చితంగా ఏ బాధ ఉండదు. మంచిగా మీకు డబ్బులు అందుతాయి. పైగా ఎక్కువసేపు కష్టపడక్కర్లేదు.

 

మీ రోజు లో కాస్త సమయాన్ని దీని కోసం వెచ్చిస్తే సరిపోతుంది. ఫాస్ట్ ఫుడ్స్ కి డిమాండ్ ఎక్కువ ఉన్న విషయం మనకి తెలుసు. అందులోనూ సాండ్విచ్ అంటే చాలా మందికి ఇష్టం. సాండ్విచ్ బిసినెస్ ని మీరు మొదలుపెట్టి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు దీనికోసం స్ట్రీట్ ఫుడ్ లాగ స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి ఒక షాప్ ని అద్దెకి తీసుకోవాలి కావాలంటే మీరు బేకరీలా కూడా మొదలు పెట్టొచ్చు.

సాండ్విచ్ తయారు చేయడానికి గ్రిల్ సాండ్విచ్ మిషన్ అవసరమవుతుంది పదివేల నుంచి ఈ మిషన్ ధర ఉంటుంది. అలాగే మిషన్ తో పాటుగా బ్రెడ్, మసాలా సామాన్లు ఇలా కొన్ని ఆహార పదార్థాలు అవసరం అవుతాయి. మీరు శాండ్విచ్ ని తయారు చేయడం కోసం కావాలంటే శిక్షణ తీసుకోవచ్చు. బేకరీ ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధి శిక్షణ కేంద్రాలలో మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారం బాగా సక్సెస్ అవ్వాలంటే మీరు రుచి నాణ్యతని బాగా మెయింటైన్ చేయాలి. ఇందులో మీరు 50 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా నెలకి 50 వేల రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. కేవలం తక్కువ సమయమే వ్యాపారం చెయ్యాలంటే సాయంత్రం పూట్ల సాండ్విచ్ ని స్టాల్ ఓపెన్ చేసి అమ్మచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news