సంగారెడ్డిలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

-

సంగారెడ్డి జిల్లా గడ్డి పోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. హెటీరో పరిశ్రమ ఆవరణలో చిరుత సంచరించడంతో చిరుతను చూసిన పరిశ్రమ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఇక సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హెరిట పరిశ్రమకు చేరుకొని చిరుతను బంధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు చిరుతను బంధించారు.

చిరుతను బంధించిన అనంతరం డిఎఫ్ఓ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ” చిరుత రెస్క్యూ ఆపరేషన్ లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తానికి రెస్క్యూ సక్సెస్ అయింది. చిరుత మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది. గతంలో చేసిన రెస్క్యూ వేరు.. ఇప్పుడు చేసిన రెస్క్యూ పెద్ద టాస్క్. చిరుతకు మత్తు ఇంజక్షన్ ఆ తర్వాత బోన్ లో ఎక్కించి జూకి తరలించాము. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉంది. మత్తుతో కొద్దిగా డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ప్రథమ చికిత్స అందిస్తున్నాము ” అని తెలిపారు డిఎఫ్ఓ శ్రీధర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news