కోమటిరెడ్డికి ‘కేడర్’ కష్టాలు…!

-

అదేంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు…ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది…కేడర్ బలం ఎక్కువ ఉంటుంది..అలాంటప్పుడు ఆయనకు కేడర్ కష్టాలు ఏంటి అని డౌట్ రావొచ్చు..అయితే ఆయనకు సొంత కేడర్‌తో కష్టాలు లేవు గాని…మునుగోడులో బీజేపీ కేడర్ తోనే ఇబ్బందులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన కోమటిరెడ్డికి దగ్గరవ్వడంలో మునుగోడు బీజేపీ కేడర్ కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మునుగోడులో బీజేపీకి పెద్ద  కేడర్ లేని సంగతి తెలిసిందే…అలా అని ఎంతోకొంత ఉన్న కేడర్‌ని సమన్వయం చేసుకుపోతే కష్టమే. గత ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ నుంచి గంగిడి గోవర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు…కేవలం 12 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయారు. అంటే మునుగోడులఓ బీజేపీకి 10 వేల పైనే ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు ఇప్పుడు కోమటిరెడ్డికి చాలా కీలకం. అప్పుడు పడిన ఓట్లు అన్నీ…ఇప్పుడు కోమటిరెడ్డికి పడితే చాలా బెనిఫిట్.

ఎలాగో కాంగ్రెస్ నుంచి కొంత కేడర్ రాజగోపాల్ రెడ్డితో పాటు వచ్చింది. అలాగే కాంగ్రెస్ వీక్ అవ్వడం వల్ల..ఆ పార్టీని ఆదరించే ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు చూడొచ్చు..అలాగే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కలిసిరావొచ్చు. ఈ క్రమంలో బీజేపీకి ఉన్న ఓటర్లు కూడా కోమటిరెడ్డికి కలిస్తే ఇంకా బెనిఫిట్ అవుతుంది. అయితే కోమటిరెడ్డి బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి…అసలైన బీజేపీ కేడర్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని తెలిసింది.

ఇప్పటికీ కోమటిరెడ్డి వెనుక కాంగ్రెస్ నుంచి వచ్చిన కేడర్ తప్పితే…స్థానిక బీజేపీ క్యాడర్‌ కలిసి పనిచేసే పరిస్థితి ఏర్పడలేదు. అటు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర ఇన్‌చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి దూరంగానే ఉన్నారు. అయితే గంగిడికి కీలక పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు బీజేపీ సమన్వయకర్తగా నియమిస్తారని తెలుస్తోంది. మరి అప్పుడైనా మునుగోడులో బీజేపీ కేడర్ కోమటిరెడ్డి వైపుకు వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news