సీఎం జగన్ అనిల్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే సీటు ఇస్తాడా ?

-

ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. అంతే కాకుండా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు అనిల్ కు దక్కదా అన్న అనుమానాలు సొంత పార్టీ వర్గాలలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు సీటును ఎవరికి ఇవ్వాలి అని సీఎం జగన్ కంఫర్మ్ అయి ఉంటారు. అలాంటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నాకు జగన్ సీటు ఇస్తే ? అన్న మాటలు వాడకుండా ఉంటే ఈ అనుమానాలు వచ్చేవి కాదు. ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా అనిల్ పోటీ చేస్తుంటే… జగన్ చెబితే నేను పార్టీకి సేవ చేసుకుంటాను కానీ… రాజకీయాలు నుండి తప్పుకోను.. జగన్ చెబితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా నేను సపోర్ట్ చేస్తానని కీలక వ్యాఖ్యలు చేయడంతో అనిల్ కుమార్ కి సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మరి సీఎం జగన్ అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news