అదిరే కేంద్ర ప్రభుత్వ స్కీమ్… ఏడాదికి రూ.51 వేలు…!

-

చాలా మంది నచ్చి స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటున్నారు. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా ఒకటి. ప్రధాన మంత్రి వయ వందన యోజన ద్వారా చాలా మంది లాభాలను పొందుతున్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల వారికి ఉపయోగపడే స్కీమ్స్ ని ఇస్తోంది. పెన్షన్‌దారులకు పెన్షన్‌ స్కీమ్‌ను కూడా ఇస్తోంది కేంద్రం.

ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్:

ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్ లో చాలా మంది చేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 26 మే 2020న ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని పొందాలి అంటే 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ని పొందవచ్చు.

వయ వందన యోజన స్కీమ్ వివరాలు:

ప్రధాన మంత్రి వయ వందన యోజన వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ని పొందేందుకు అవుతుంది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.

ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు..?

ఈ స్కీమ్ లో 60 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు దీనిలో చేరచ్చు.
గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి ని ఈ స్కీమ్ లో పెట్టచ్చు.
సీనియర్ సిటిజన్‌లు ఎక్కువగా దీనిలో పెట్టుబడి పెడుతూ వుంటారు.

వయ వందన యోజన స్కీమ్ కింద ఎంత పొందొచ్చు..?

ఈ స్కీమ్ కింద భార్యాభర్తలిద్దరూ 7.40 శాతం ని పొందొచ్చు.
పెట్టుబడిదారుడి వార్షిక పెన్షన్ రూ.51 వేలు అవుతుంది.
ప్రతీ నెలా డబ్బులని తీసుకోవాలంటే ప్రతి నెలా మీకు పెన్షన్‌గా రూ.4100 అందుతుంది.
గరిష్టంగా రూ.9250 పెన్షన్ పొందవచ్చు.
ఈ పథకం లో మీ పెట్టుబడి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పాటు వార్షిక లేదా నెలవారీ పెన్షన్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news