యోనో ఎస్‌బీఐ నుండి డబ్బులని పంపించాలా..? అయితే ఇలా చేసేయండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తోంది. దీనితో చాలా మంది ప్రయోజనాలని అందిస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు డబ్బులని పంపించేందుకు కష్ట పడక్కర్లేదు. స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వుండేవాళ్ళు యోనో ఎస్‌బీఐ యాప్‌ ద్వారా పంపుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీని యాడ్ చెయ్యాలి. ముందుగా ఇలా యాడ్ చేస్తే డబ్బులు పంపుకోవచ్చు.

యోనో ఎస్‌బీఐ యాప్ ని ముందుగా ఇంస్టాల్ చేసుకోవాలి.
తరవాత అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
తర్వాత యోనో పే పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు ప్రొఫైల్ మనగెమెంత్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
నెక్స్ట్ మీరు Add/Manage బెనెఫిషరీ ఆప్షన్ ని ఎంచుకోండి.
మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ని కొట్టండి.
ఇప్పుడు ఓ ప్రాసెస్ సెలెక్ట్ చేయండి.
అకౌంట్ నెంబర్ యాడ్ చేసి నెక్స్ట్ పైన నొక్కండి.
ఎస్‌బీఐ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేయండి. అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి.. ఇతర బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి.
బెనిఫీషియరీకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.
రిమార్క్ యాడ్ చేసి పే ఆప్షన్ పైన నొక్కండి.
కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దాన్ని కన్ఫామ్ చేయండి.
ఓటీపీ వచ్చాక దాన్ని కూడా మీరు ఎంటర్ చేయండి.
బెనిఫీషియరీ అకౌంట్ రాబోయే 24 గంటల్లో యాడ్ అవుతుంది.
ఈ ప్రాసెస్ అయ్యాక మీరు ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news