ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వాటి ధరలు చూస్తే… సామాన్యుడి గుండె బరువెక్కుతోంది. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్ చేసేస్తుంది.
అయితే, గత పది నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గగా, రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు 139.13 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం 87.81 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, భవిష్యత్తులో 82 డాలర్లకు తగ్గే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ. 5 తగ్గుదల కనిపించవచ్చు. కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.