అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. 95 రూపాయలు పొదుపు చేస్తే 14 లక్షలు…!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. చాలా స్కీమ్స్ వస్తున్నాయి కూడా. అయితే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తున్నాయి. అయితే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. చిన్న, మధ్య తరగతి ప్రజల కోసం పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి.

వీటిలో పెట్టుబడి కనుక పెడితే చక్కగా రాబడి వస్తుంది. అలానే మీ డబ్బుల కి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా తీసుకు రావడం జరిగింది. మరి ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

రోజుకు 95 రూపాయలలు ఆదా చేస్తే కొన్ని సంవత్సరాలలో మీరు 14 లక్షల రూపాయలను పొందొచ్చు. గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం ద్వారా ఎలా డబ్బులొస్తాయి..?, ఎంత వస్తాయి వంటి వివరాలలోకి వెళితే.. ఈ పథకం కింద ఒక వ్యక్తి ప్రతిరోజు రూ.95 వెచ్చించాల్సి వుంది.

మీరు మెచ్యూరిటీపై రూ. 14 లక్షలు పొందుతారు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మెచ్యూరిటీపై బోనస్ కూడా వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఒక వ్యక్తి 15 మరియు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎంత వయస్సు పాలసీదారుడికి ఉండాలి అన్నది చూస్తే.. 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ స్కీమ్ లో రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి మంచిగా డబ్బులు పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news