అదిరే ఆఫర్.. బ్యాంక్ కి వెళ్లకుండానే రూ.8,00,000 లోన్..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను తీసుకు వస్తూనే వుంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో బెనిఫిట్ గా ఉంటోంది. అయితే ఎస్‌బీఐ మరోసారి ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. ఇది కస్టమర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఈ ఇన్‌స్టంట్‌ పర్సనల్ లోన్ ని యోనో ద్వారా అందిస్తోంది బ్యాంక్. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ లోన్ కోసం ఇంటి నుండే అప్లై చేసుకోవచ్చు. గతంలో కూడా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ ని తీసుకు రావడం జరిగింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా ఈజీగా ఈ లోన్ ని పొందవచ్చు.

మీ లోన్ ఒకే అయ్యిందా లేదా అనేది మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపి తెలుసుకోవాల్సి ఉంటుంది. PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు.

ఇక ఎంత లోన్ వస్తుంది అనేది చూస్తే.. ప్రస్తుతం రూ.8,00,000 వరకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ని ఇస్తోంది. లోన్ అనేది కస్టమర్ల ప్రొఫైల్, ఉద్యోగం, ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి చూసుకుని బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ కోసం ఇలా చెయ్యండి.

ముందుగా యోనో యాప్ ని డౌన్‌లోడ్ చెయ్యండి.
ఆ తరవాత మీ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేయాలి.
గతంలోనే రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వండి చాలు.
ఇప్పుడు మీరు PAPL బ్యానర్ పైన క్లిక్ చేయాలి.
లోన్ అమౌంట్ ని ఎంటర్ చేయాలి.
టెన్యూర్ ఎంచుకోవాలి.
సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసాక మీ అకౌంట్‌లో లోన్ డబ్బులు జమ అవుతాయి.