యువగళం: నిరాధారమైన ఆరోపణలతో లోకేష్ లోకువ అవుతున్నాడా ?

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ రాష్ట్రంలో టీడీపీని అధికారంనంలోకి తీసుకురావడానికి తన వంతుగా యువగలం పేరుతో పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో మంచి స్పందన వస్తోందని టీడీపీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారు. కాగా ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక వైసీపీ నాయకుల అవినీతిపై ఏదో ఒక చిట్టా తయారు చేసుకుని బహిరంగ సభలలో వాళ్ళు అవినీతి చేశారని చెబుతున్నారు. కానీ వీటికి ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే ఎవరైనా ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉంది. అలా కాకుండా కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతకు ముందు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన చింత విజయ్ ప్రతాప్ రెడ్డి మీద భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు చేశారు లోకేష్…ఆ తర్వాత ఆయన ఆధారాలతో సహా ఎవరి పేరు మీద ఈ భూములు ఉన్నాయన్నది వీడియోలు చేసి పెట్టడంతో లోకేష్ చెప్పిననవన్నీ అబద్దాలు అని ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పెయిన్ అవెయ్యి కోట్లు అవినీతి చేశాడని సభలలో ఆరోపించారు.

దీనిపై చర్చకు రావాలని అనిల్ కుమార్ యాదవ్ సవాలు చేస్తున్నాడు. మరి ఈ విషయంపై ఆధారాలు బయటపెట్టకపోతే లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు మరియు అనవసరంగా ఎన్నికల ముందు ఇది పార్టీకి నెగటివ్ గా మారే ప్రమాదం లేకపోలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news