120 రోజులు ఇంటికి సెలవు పెట్టి.. కష్టపడి పని చేయాలి – రేవంత్‌ రెడ్డి

-

120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని కాంగ్రెస్‌ నేతలకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు రేవంత్. బీజేపీ, బీఆరెస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని..దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం అన్నారు.

ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని.. గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. బీజేపీ, బీఆరెస్ ను ఎదుర్కొనేందుకు మన శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలని.. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని… పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో పార్టీ బూత్ ఎన్ రోలర్సే బీఎల్ఏ లు అని వివరించారు. యాక్టివ్ గా ఉన్న బూత్ ఎన్ రోలర్స్ ను బీఎల్ఏ లుగా నియమిచుకోవాలని.. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news