బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ ల ఫార్మాట్ కు కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బల్ తన కెరీర్ లో కీలక నిర్ణయం తీసుకుని అభిమానులకు మరియు బంగ్లా క్రికెట్ యాజమాన్యానికి షాక్ ఇచ్చాడని చెప్పాలి. కాసేపటి క్రితమే ఇక్బల్ మీడియా ద్వారా నేను అన్ని ఫార్మాట్ ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న వన్ డే సిరీస్ కు కెప్టెన్ గా మొదటి మ్యాచ్ లో ఆడాడు. కానీ ఈ మ్యాచ్ లో బంగ్లా ఓటమి పాలయింది… వన్ డే వరల్డ్ కప్ కు మరో నాలుగు నెలలు ఉండగా ఇప్పుడు రిటైర్ కావడంతో తెలియని అయోమయ స్థితిలో బంగలా మానేజిమెంట్ ఉంది. తమీమ్ ఇక్బల్ తన క్రికెటింగ్ కెరీర్ లో ఇప్పటి వరకు 241 వన్ డే లు ఆడగా 8313 పరుగులు చేశాడు.
ఈ ఫార్మాట్ లో బంగ్లా తరపున ఇతనివే ఆత్యదిక పరుగులు కావడం విశేషం. ఇక 70 టెస్ట్ లు ఆడిన తమీమ్ ఇక్బల్ 7188 పరుగులు చేశాడు. ఇది నిజంగా బంగ్లాదేశ్ క్రికెట్ కు ఊహించని రోజు అని చెప్పాలి.