బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్… నచ్చిన నెంబర్ తో అకౌంట్ ఓపెన్ చెయ్యండి…!

-

మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ కస్టమర్ల కోసం సూపర్ సర్వీసులు అందుబాటు లోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…. మీకు నచ్చిన నెంబర్ల తో బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు.

అంటే మీకు ఏ అంకెలు లక్కీ ఓ లేదా మీకు నచ్చినవి ఇలా మీ ఇష్టం వచ్చినట్టు బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఐ చ్యూజ్ మై నెంబర్ అనే సర్వీసులను జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకు రావడం జరిగింది. అయితే ఈసేవలు ఏమిటా అనేది చూస్తే….

ఈ సర్వీసెస్ లో భాగంగా కస్టమర్లు వారి నచ్చిన నెంబర్ల తో బ్యాంక్ ఖాతాను ఓపెన్ చెయ్యవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే….?సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది గమనించాలి. కస్టమర్లు 10 నెంబర్ల అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇది వరకు ఈ నెంబర్‌పై బ్యాంక్ ఖాతా లేనట్లయితే.. ఆ నెంబర్‌పై మీకు బ్యాంక్ ఖాతా క్రియేట్ చేయడం జరుగుతుంది. లేదు అంటే వేరే నెంబర్ ఇవ్వాలి. కాగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2015 నుంచి బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తూ వస్తోంది. ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది ఎన్నో రకాల సేవలని ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version