గర్భిణులు కీరాదోసకాయను తినొచ్చా..? తింటే ఏం జరుగుతుంది..?

-

సమ్మర్‌ వచ్చేసింది.. ఇంట్లో ఉన్నా బాడీ వేడిగా అవుతుంది. ఇలాంటప్పుడే మనం తెలివిగా ప్రవర్తించాలి.. బాడీకి చలవ చేసేవి తినాలి. రోజు ఒక కీరాదోసను తింటే..మీ శరీరం కూల్‌గా ఉంటుంది. కీరాదోసను ఎవరైనా తినొచ్చు.. అయితే గర్భిణులు తినొచ్చా లేదా అనేది చాలామందికి డౌట్‌ ఉంటుంది. అవును గర్భిణులు కీరాదోసను తినొచ్చా..?

కీరదోసలో పొటాషియం, కాల్షియం, ఇనుము, విటమిన్ కె, విటమిన్ సీ, జింక్ సహా అనేక రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి పిండం పెరుగుదలకు చాలా దోహదపడతాయి. అలాగే విటమిన్ B6, విటమిన్ B9 అనే ఫీల్ గుడ్ విటమిన్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి..మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా తరచూ ఆందోళన చెందే గర్భిణీలకు అత్యంత ప్రయోజనకరం.

దోసకాయ తినడం వల్ల రక్తపోటు సమస్యలు ఉండవు. గర్భధారణ సమయంలో రక్తపోటు సరిగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుంది. గర్భిణీల్లో హార్మోన్ల సమస్య వల్ల ఎక్కువగా రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దోసకాయ తినడం వల్ల కొంత కంట్రోల్‌ అవుతుంది.

అలా అని దోసకాయను ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఇందులో ఉప్పు, నీరు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచు మూత్రం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తగిన మోతాదులోనే తినాలి.

గర్భిణులు ఏం తినాలన్నా సందేహ పడుతుంటారు. ఏం తినాలో తినొద్దు తెలుసుకోని..తినాలి..కానీ ఇప్పుడు ఇదెందుకులే అని లైట్‌ తీసుకోవద్దు..గర్భిణులకు రోజుకు 43 గ్రాముల ప్రొటీన్లు అవసరం అవుతుంది…మీ డైట్‌లో జొన్నలు, రాగుల వంటి వాటితో పాటు పప్పుధాన్యాలు, నట్స్‌, లీన్‌, మాంసం, మొలకెత్తిన గింజలు, బీన్స్‌, చేపలు, శనగలు, గుడ్డు చేర్చుకోండి వంటివి చేర్చుకోవాలి. గర్భధారణ సమయంలో రోజుకు.. 27 mg ఐరన్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 1300 mg కాల్షియం అవసరం. శిశువు ఎముకలు ఏర్పడటానికి కాల్షియం సహాయపడుతుంది. పుట్టబోయే పిల్లల వెన్నుపాము, మెదడులో ఎటువంటి సమస్యలు రాకుండా.. గర్భిణులకు ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్‌ ఇస్తుంటారు. గర్భధారణ సమయంలో ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం వల్ల బిడ్డ పెరుగుదలలో లోపాలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల నుంచి బిడ్డను రక్షించవచ్చు. రోజుకు 400 మైక్రోగ్రాముల (0.4 మిల్లీగ్రాముల) ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. ఇది గుడ్లు, గింజలు, బీన్స్, సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాల్లో మెండుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news