వైఎస్ అకాల మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుండి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వైఎస్ జగన్ సొంతకాళ్ళమీద పార్టీ పెట్టి నేడు ఏపీకి సక్సెస్ ఫుల్ గా సీఎంగా ఉన్నాడు. ఇక సోదరి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ వైస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి నాన్న ఆశయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించడమే తన లక్ష్యమని పోరాడుతోంది. కాగా నేడు రాహుల్ గాంధీ గురించి చేసిన ట్వీట్ వలన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందా అన్న వార్తలకు బలం చేకూరింది. వాస్తవానికి ఈ విధంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ప్రజలు హర్షిస్తారా ? తన నాన్న వైఎస్సార్ ఆత్మ సంతోషిస్తుందా ? తన అన్న జగన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టిన పార్టీలోకి వెళితే జగన్ బాధపడడా ? ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి.
లేదు ఏమైనా పర్లేదు నేను పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వాటి చేయాల్సిందే.