షుగర్‌ పేషంట్స్‌ వంకాయను తినొచ్చా..?

-

షుగర్‌ పేషంట్స్‌ ఏది తినకూడదో మాత్రమే బాగా తెలుసుకుంటారు.. అసలు ఏవి తింటే షుగర్‌ కంట్రోల్లో ఉంటుందనేది తెలుసుకోవడం ఇంకా ముఖ్యమైన విషయం. అన్ని పండ్లు, కూరగాయల్లో పోషకాలు ఒకే తీరు ఉండవు. కొన్నింటిలో ఎక్కువ ఉంటే..మరికొన్ని వాటిల్లో తక్కువ ఉంటాయి. ఈరోజు మనం షుగర్‌ పేషంట్స్‌కు మేలైన కూరగాయలు ఏంటో చూద్దామా..!

క్యాబేజీ

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక క్యాబేజీలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

బ్రోకలీ

ఈ కూరగాయలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల శోషణ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపుచేస్తాయి. అలాగే ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తిచేస్తుంది. ఫలితంగా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. షుగర్‌ పేషెంట్స్‌కు ఇది మంచి కూరగాయగా చెప్పుకోవచ్చు.

కాలీఫ్లవర్

బ్రోకలీ మాదిరిగానే కాలీఫ్లవర్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. అలాగే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గేలా సహాయపడతాయి.

వంకాయ

షుగర్‌ ఉన్నవారు వంకాయను తినొచ్చా లేదా సందేహ పడుతుంటారు. వంకాయ అంటే దురద అని చాలామందిలో అపోహ ఉంది. నిజానికి వంకాయ మంచి కూరగాయ. ఇందులో ఫైబర్‌ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రక్తంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

ఏ ఆహారంలో అయితే ఫైబర్‌ ఎక్కువగా ఉంటుందో అది ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్దకం సమస్య ఉండదు. కొవ్వు కరుగుతుంది. రక్తంలో చెక్కరను నియంత్రిస్తుంది. వీటిల్లోనే కాదు.. మనం తినే ఆహారంలో రోజువారి ఫైబర్‌ శాతం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అప్పుడే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా ఉండదు. షుగర్‌ పేషంట్స్‌ వీటని కూడా వారానికి రెండుమూడు సార్లైన తింటూ ఉంటే షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version