మనకు ఉన్న అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి.. ఇవి దెబ్బతింటే.. మధుమేహం కూడా వస్తుంది. ఇంకా చాలా సమస్యలు వస్తాయి. అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉంటాయి. మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే మనం తీసుకునే ఆహారాల వల్ల అవి కరిగిపోతాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు పైనాపిల్ తినొచ్చా లేదా అనేది చాలామందికి ఉండే కామన్ డౌట్.. అవును ఇవి తినొచ్చా లేదా..?
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీన్ని తింటే నోట్లో మంటగా అనిపిస్తుంది. కనుక సాధారణంగా పైనాపిల్‌ను ఎక్కువ శాతం మంది జ్యూస్ రూపంలోనే తీసుకుంటారు. అయితే వాస్తవానికి పైనాపిల్ ఎంతో అద్భుతమైన పండు అని చెప్పవచ్చు. ఇందులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. పైనాపిల్‌ను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. పైనాపిల్‌లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. సిట్రిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
పైనాపిల్‌లో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన డైజెస్టివ్ ఎంజైమ్. ఇది అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మన శరీరంలో అనేక చోట్ల పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతోపాటు కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూస్తుంది. ఉన్న స్టోన్స్‌ను కరిగిస్తుంది. కనుక పైనాపిల్‌ను.. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు నిర్భయంగా పైనాపిల్‌ను తినవచ్చు. దీంతో స్టోన్స్ కరుగుతాయి..కిడ్నీ స్టోన్లు ఉన్నవారు పైనాపిల్‌ను తినాలా.. వద్దా.. అని సందేహించాల్సిన పనిలేదు. రోజూ ఒక కప్పు మోతాదులో పైనాపిల్ ముక్కలను తింటున్నా.. లేదా.. జ్యూస్‌ను తాగుతున్నా.. స్టోన్స్ కరిగిపోతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందేహ లేకుండా.. హ్యాపీగా తినేయండి.. కిడ్నీలో రాళ్లు ఉంటేనే కాదు.. ఇంకా చాలా రకాలుగా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉండండి..!