రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై చర్చ రేపు జరగనుంది. ఒకవేళ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఏరకమైన ఆందోళనలు చేయాలని మంత్రుల నుంచి అడిగి కేసీఆర్ సూచనలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Telangana State Cabinet Meeting Outcome Today: All you need to know about  Covid-19 situation | Zee Businessగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పారు. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. దీనికోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరారు ఎంపీ కవిత. దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు అలాగే గిరిజన బంధు పైన కూడా చర్చించనున్నారు. సొంత ఇల్లు ఉండి నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించే పథకంపై కూడా మంత్రి వర్గంలో చర్చించనున్నారు. ఈ పధకానికి సంబంధించి విధివిధానాలపై మంత్రులతో చర్చిస్తారు. ఇళ్ల స్థలాల కోసం పట్టాల పంపిణీ కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news