ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి మనీ తీయొచ్చా..?

-

డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ పెరిగాక.. ఏటీఎంలకు వెళ్లే వారి సంఖ్య చాలా తగ్గింది..కానీ కొన్ని ప్రాంతాల్లో లిక్విడ్ క్యాషే తీసుకుంటారు.. మనకా పర్స్‌ వాడటం పూర్తిగా మర్చిపోయాం.. ఎక్కడకు వెళ్లినా ఫోన్‌పే, గూగుల్‌పే.. ఇమాజిన్..మీ దగ్గర లిక్విడ్‌ క్యాష్‌ లేదు.. ఉన్నచోట ఆన్‌లైన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ లేదు. పక్కనే ఏటిఎం ఉన్నా పర్స్‌ ఇంట్లో ఉంది..అప్పుడు ఏం చేస్తారు..? ఈ ఆర్టికల్‌ ఫుల్‌గా చదవండి..!!

ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) అని పిలువబడే కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఆప్షన్‌ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సదుపాయానికి ఎటువంటి రుసుము లేదు. నగదు కోసం ఏటీఎంకు వెళ్లినప్పుడు కార్డును తీసుకెళ్లడం లేదా ఏటీఎం పిన్ నంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సదుపాయంతో తప్పు పిన్ నంబర్‌ను నమోదు చేయడం, లావాదేవీ వైఫల్యం, కార్డ్ నష్టం మొదలైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఎలా అంటే..

గూగుల్‌పే, పోన్‌పేతో సహా చాలా యూపీఐ యాప్‌లలో ఐసీసీడబ్ల్యూ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని పొందడానికి మొబైల్, ఏటీఎం మెషీన్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఈ పద్ధతిలో గరిష్టంగా రూ. 5,000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడం ఎలా అంటే..

ఏటీఎం మెషీన్‌ స్క్రీన్‌పై ఉన్న విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

తర్వాత కనిపించే యూపీఐ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి..

మీరు యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోగానే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.

మొబైల్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి.

తర్వాత యూపీఐ లావాదేవీ మోడ్‌లోనే విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని (గరిష్టంగా రూ.5వేలు) నమోదు చేయాల్సి ఉంటుంది..

తర్వాత యూపీఐ పిన్‌ను నమోదు చేసి కొనసాగించాలి.

ఇలా చేసిన వెంటనే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. అంతే..

ఈ సారి ఏటీఎంకు వెళ్లినప్పుడు ట్రై చేయండి.! అయితే గుర్తుంచుకోండి..ఇలా ఐదువేల కంటే ఎక్కువ మనీ తీయలేరని..!

Read more RELATED
Recommended to you

Latest news