ఆ నటుడు నుంచి మెసేజ్ వస్తే ఎన్టీఆర్ కు అంత చిరాకు ఎందుకు..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులతో కూడా స్నేహ బంధాలు బాగానే ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు రాజీవ్ కనకాల కూడా ఒకరిని చెప్పవచ్చు. వీరిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. కేవలం చిన్న గొడవతో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది.దీంతో ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో కూడా రాజీవ్ కనకాల ఉండేలా చూసుకునేవారు.

తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక పాత వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. రాజీవ్ కనకాల గురించి ఓ మెసేజ్ వస్తే తారకు తెగ చిరాకు వస్తుందట. ఆ కారణంగానే తనకు నవంబర్ నెల అంటే చాలా భయమని చెప్పుకోస్తూ ఉంటారు. ఇంతకీ అసలు రాజీవ్ ఏం మెసేజ్ చేసేవారు.. ఎందుకు తారక్ కు నచ్చదు అనే విషయం ఒకసారి తెలుసుకుందాం. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం చిల్డ్రన్ డే వస్తే తనకు రాజీవ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పెట్టే వారిని తెలిపారు.

ఆ మెసేజ్ రావడం తనకు చిరాకు వస్తుందని అంతేకాకుండా రాజీవ్ ఫోన్లో తారక్ పేరు కూడా (కిడ్) అని సేవ్ చేసుకున్నారట. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ రాజీవ్ కనకాల మాత్రం ఇప్పటికీ తనకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పంపిస్తూ ఉంటారని తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news