షాకింగ్; ప్రధాని భార్యకు కరోనా…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తూ ప్రముఖులను కూడా భయపెడుతుంది. దాదాపు 110 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని ఇంతగా భయపెడుతున్న వ్యాధి మరొకటి లేదు అనేది వాస్తవం. ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా ప్రజలు ఈ స్థాయిలో భయపడే పరిస్థితి ఉండదు ఏమో…? ఆ విధంగా కరోనా వైరస్ అందరికి చుక్కలు చూపిస్తుంది. వేగంగా… అత్యంత వేగంగా విస్తరిస్తుంది.

తాజాగా ఒక దేశ ప్రధాని భార్యకు కరోనా వైరస్ సోకింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీకి కరోనా వైరస్‌ సోకినట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఆమెకు వైరస్ లక్షణాలు ఉన్న నేపధ్యంలో ఇంట్లోనే ఉండిపోయారు ఆమె. ప్రధానికి కూడా వైద్య పరిక్షలు చేసారు అధికారులు. తన భార్యకు వైద్య లక్షణాలు ఉన్నాయని కాబట్టి తాను విధులను ఇంటి నుంచి నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఆమె ఇటీవల బ్రిటన్ లో ఒక కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడ ఆమెకు కరోనా వైరస్ సోకింది ఏమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అని అధికారులు సూచిస్తున్నారు. ప్రధాని ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేసారు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రధాని భార్యకు రావడం మాత్రం ఆందోళన కలిగించే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news