వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కారు పంక్చర్ కావడం ఖాయం అన్నారు మాజీ మంత్రి రేణుక చౌదరి. నేడు ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఖమ్మంలో కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ రాజకీయ బిక్ష పెట్టిందని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు రేణుక చౌదరి. తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో కాంగ్రెస్ తరపున గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్లంతా తిరిగి యూటర్న్ తీసుకుంటారని అన్నారు. ఇక ఖమ్మంలో పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం తో పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని తెలిపారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బరిలో ఉంటానని వివరించారు.