తెలంగాణ బిజేపిలో టెన్షన్ : బండి సంజయ్ కు కరోనా ?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ మనదేశంలోనూ విలయం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలకు ఈ వైరస్ సోకింది. ఇందులో కొంత మంది కొలుకోగా.. మరి కొందరు కరోనాకు బలి అయ్యారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపిలో ఈ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి కరోనా లక్షణాలు బయట పడ్డట్లు సమాచారం.

దీంతో బండి సంజయ్ ఇవాళ మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ రిపోర్ట్ రేపు సాయంత్రం రానుంది. బండి సంజయ్ తో ఉండే కొందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు బండి సంజయ్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బండి సంజయ్ క్వారంటైన్ లో ఉన్నారు. రేపు కోవిడ్ టెస్ట్ లో ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అని అందరిలోనూ టెన్షన్ నెలకొంది. కాగా.. ఇటీవలే ఢిల్లీకి వెళ్ళిన బండి సంజయ్..ఈటల చేరికపై బిజేపి పెద్దలతో మంతనాలు జరిపారు.