క్యాష్: ప్రోగ్రామ్ వల్ల మల్లెమాలకి లాభమా.. నష్టమా..?

-

ఈటీవీలో ఎన్నో కార్యక్రమాలు , సీరియల్స్ ప్రసారమవుతూ ఉన్నాయి. కానీ ఇందులో రియాల్టీ షోల ద్వారా మాత్రం రేటింగ్ తో పాటు పలు ఆదాయాన్ని కూడా సంపాదిస్తూ ఉన్నారు. అలా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్,క్యాష్ వంటి షో లతో కొనసాగుతూ మల్లెమాల బాగానే ఆర్జిస్తోంది.ఈ కార్యక్రమాలన్నీ కూడా మల్లెమాల సంస్థ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా నెంబర్ వన్ స్థానంలో టీ ఆర్ పీ రేటింగ్ నమోదు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు మల్లెమాలకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. కానీ ఈ రెండింటికి మించి సుమా యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కి భారీ లాభాలను తెచ్చి పెడుతున్నది అంటూ బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బుల్లితెర నుంచీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. క్యాష్ ప్రోగ్రామ్ కి పెద్దగా ఖర్చు అక్కరలేదట. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కమెడియన్లకు రెమ్యూనరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.. కానీ క్యాష్ కార్యక్రమానికి అదంతా అవసరం లేదు.. కనుక మల్లెమాలవారికి ప్రొడక్షన్ కాస్ట్ భారీగా తగ్గిపోతుందని చెప్పవచ్చు.

అందుచేతను ఈ ప్రోగ్రామ్ అతి తక్కువ ఖర్చుతో కూడి ఉంటుంది . ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. జబర్దస్త్ కార్యక్రమం హైదరాబాదులో షూటింగ్ నిర్వహించగా క్యాష్ కార్యక్రమం మాత్రం ఈటీవీ కి చెందిన రామోజీ ఫిలిం సిటీ లోని షూటింగ్ నిర్వహిస్తూ ఉంటారు. అది కూడా పెద్దగా ఖర్చు లేదని బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక క్యాష్ ప్రోగ్రాంలో వచ్చేవారు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సమాచారము. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే వచ్చేందుకు వారు కొంత మొత్తంలో మల్లెమాలకు ఇస్తారని సమాచారం. దీంతో మల్లెమాలకు ఈ షో ల నుంచీ కొన్ని లక్షల రూపాయలు ఆదాయం అందుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version