ఢిల్లీ డిప్యూటీ సీఎంకు CBI లుకౌట్ నోటీసు

-

ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తు పోయే విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించిన పక్క ఆధారాలు సేకరిస్తుంది సిబిఐఐ. ఈ కేసులో 14 మందితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సిబిఐ. ఏ1 గా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను చేర్చింది. ఢిల్లీలో మనీష్ సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

దేశం విడిచి వెళ్ళరాదని సిబిఐ పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 13 మందికి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలపై సిబిఐ ఈ కేసు నమోదు చేసింది. ఈ స్కామ్ లో తెలంగాణ లింకులు కూడా బయటపడుతున్నాయి. ఈ డీల్ వెనక ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news