వివేకా హత్య కేసు నిందితులెవరో తేల్చిన సీబీఐ

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు సునీల్ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ.. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకాను సునీల్ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడన్న సీబీఐ… హత్య జరిగిన రాత్రి సునీల్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని.. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని వివరించింది.

ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరినట్లు సీబీఐ వెల్లడించింది. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని… శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని దర్యాప్తులో సీబీఐ తేల్చింది.  సాక్ష్యాల ప్రకారం శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌ కుట్రపన్నినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారన్న సీబీఐ.. వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాష్‌రెడ్డి స్థానిక సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపింది.

అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వివేకా హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందన్న సీబీఐ…. కుట్రలో భాగంగానే గుండె, రక్తవిరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోందని పేర్కొంది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని సీబీఐ అధికారులు తెలిపారు. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news