ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మీమ్‌ను వాడేసిన సీబీఎస్ఈ.. ఎందుకంటే…?

-

దేశంలోనే ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ CBSE ) ఈ వారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేస్తుంద‌ని అంద‌రూ ఆశించ‌డంతో అది కాస్త లేట్ అవుతుంద‌ని తెలుస్తోంది. దీంతో ఆత్రుతతో ఉన్న తల్లిదండ్రులతో పాటు వారి పిల్ల‌లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఫ‌లితాలు వ‌స్తాయంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో వారిని శాంతింప‌జేయ‌డానికి సీబీఎస్ ఈ ట్విట్టర్ ద్వారా ఒక ఆస‌క్తిక‌ర‌మైన మీమ్‌ను పోస్టు చేసింది.

తాజాగా సీబీఎస్ఈ చేసిన ఈ పోస్టులో బోర్డు ఫలితాలపై ఒక అప్‌డేట్ ను ఆ మీమ్ ద్వారా చేసింది. ఇందుకు ఏకంగా ప్రముఖ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ నుండి ఒక మీమ్ ను ఉపయోగించి వేచి ఉండండి అంటూ అటు తల్లిదండ్రులను ఇటు స్టూడెంట్ల‌ను అభ్యర్థించారు సీబీఎస్ ఈ అధికారులు.

ఇక ఈ ఈ పోస్ట్ లో మనోజ్ బాజ్ పేయి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులుగా అలాగే ఉదయ్ మహేష్ పోషించిన ప్రముఖ పాత్ర ‘చెల్లమ్ సర్స‌తో ఓపికగా వేచి ఉండమని కోరుతున్న‌ట్టు ఉంది. #StayCalm #StayHopeful అనే హ్యాష్ ట్యాగ్ లతో పాటు ఈ థీమ్ బాజ్ పేయీ పాత్ర శ్రీకాంత్ తివారీని సూచిస్తుంది. ఇక సీబీఎస్ఈ ఆన్ లైన్ లో ఈ పోస్టు షేర్ చేసినప్పటి నుంచి ఈ పోస్ట్ కు నెటిజన్లు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చాలామ౦ది ఆన౦ది౦చినా, మరికొ౦దరు రాబోయే పరీక్షా ఫలితాల గురి౦చి తీవ్ర విచారణ కొనసాగి౦చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version