కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్…. ఉచిత రేషన్ పథకం పొడగింపు.. ఎన్ని నెలలో తెలుసా..?

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో ఆరు నెలలు పొడగించారు. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 2022 వరకు పొడగింపుకు కేంద్ర కాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని పేదలకు లబ్ధి చేకూరనుంది. కరోనా కారణంగా చిన్నాభిన్నం అయిన కుటుంబాల లబ్ధి కోసం ఈ ఉచిత రేషన్ పథకాన్ని మరింత కాలం పొడగించారు. సెప్టెంబర్ 2022 వరకు ఈ ఫ్రీ రేషన్ అమలు కానుంది. ఈ పథకం వల్ల దేశంలో 80 కోట్ల మంది ప్రజలకుగా లబ్ధి చేకూరనుంది.

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని పేదల ఆకలి తీర్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. నెలలో ఇచ్చే కోటా కన్నా అధికంగా ఆహార ధాన్యాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ నెల 5 కేజీల బియ్యం/ గోధుమలు, కేజీ పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఈ పథకాన్ని మరో 6 నెలుల పొడగించడంతో దేశంలోని పేదలకు లబ్ధి చేకూరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news