BREAKING : TRS కు బిగ్‌ షాక్‌.. రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

-

మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ రాశారు. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.

సెప్టెంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఫ్రీ సింబల్ లిస్ట్ లో 135వ నెంబర్ గా రోడ్ రోలర్ ను పొందు పరిచామని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన కాపీని అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలాక్టోరల్ అధికారులకు పంపామన్నారు. కె శివ కుమార్ తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసున్న సమయంలో రోడ్ రోలర్ ను మొదటి ప్రాధాన్యత గుర్తుగా ఎంపిక చేసుకున్నారని వివరించారు. కాబట్టి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version