కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి శుభ వార్త చెప్పింది. వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టించేందుకే కేంద్ర బడ్జెట్ ప్రధాన సాధనంగా పని చేస్తోంది. ఇతర రంగాలతో పోలిస్తే జేసి జనాభాలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగం. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలోనూ ఇతర రంగాలన్ని కుందేలు అయినా… వ్యవసాయం మాత్రం నిలదొక్కుకుంది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణ జరిగింది.
ఇక అన్నదాతలు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. అలాగే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. వీటన్నిటినీ సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ముందు ఉన్న ఓ సదవకాశం బడ్జెట్.
పైగా సాగు చట్టాల ఆందోళనలో పాల్గొన్న వారిలో పంజాబ్ మరియు ఉత్తర ప్రదేశ్ రైతులే ఉన్నారు. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నవేళ రైతన్నలకు కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించనున్నదని సమాచారం అందుతోంది. అయితే ఈ ప్యాకేజీ ఎలాంటిది అనే దానిపై క్లారిటీ త్వరలోనే రానుంది.