కేంద్రం కీలక నిర్ణయం… జీఎస్‌టీ చెల్లింపుదారులకు శుభవార్త..!

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా వస్తు సేవల పన్ను (GST) చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. జీఎస్‌టీఆర్ 9, 9సీ దాఖలుకు మరింత గడువు ఇచ్చింది. మరో నెల రోజుల పాటు సమయం ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. అంటే అక్టోబర్ 31 వరకు ఈ ఫామ్స్‌ను దాఖలు చేయొచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

 

కాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) గతంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌కు ఒక లేఖ రాసింది. ఇందులో 2018-19 జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్ దాఖలుకు డెడ్‌లైన్‌ను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం మే నెలలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్ దాఖలుకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news