కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ తెలంగాణకి ఉంటుంది – కిషన్ రెడ్డి

-

30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెదక్ – అక్కన్నపేట ప్యాసింజర్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ తెలంగాణకి ఉంటుందని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ తరపున సెల్యూట్ చెబుతున్నామన్నారు.

అలాగే భద్రాచలం దేవాలయ అభివృద్ధి కోసం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిధులు ఇచ్చామని తెలిపారు. రామప్ప కోసం 60 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. రామాయంపేట – సిద్దిపేట రోడ్డును కూడా నేషనల్ హైవేతో కనెక్ట్ చేశామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిజాం కాలంలో కట్టారని.. 653 కోట్లతో దానిని ఆధునికరణ చేస్తామన్నారు.

మనోహరాబాద్ – కొత్తపల్లి 150 రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని రైల్వే శాఖతో ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తున్నారని.. వరంగల్ లో 450 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా 3000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news