జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన రియాసీ జిల్లాలోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రైనాను కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌లు కలిశారు. దీంతో వీరిద్దరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని జితేంద్ర సింగ్, రామ్ మాధవ్‌లు స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Am quarantining myself for a few days since my colleague n BJP J&K President Ravinder Raina tested +ve for Corona today n I was with him 48 hrs ago in Srinagar. I tested -ve for Corona 4 times during travel in last 2 weeks. Yet taking precautions to ensure safety of me n others🙏
— Ram Madhav (@rammadhavbjp) July 14, 2020
గత రెండు వారాల్లో ఐదు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఫలితం నెగిటివ్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తనతో పాటు ఇతరుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నానని రామ్ మాధవ్ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే జూలై 12న రవీంద్ర రైనాతో కలిసి శ్రీనగర్ నుంచి బందిపొరా వరకు పర్యటించాను. అందుకే రవీంద్ర రైనాకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే నేను సెల్ఫ్ క్వారెంటైన్ విధించుకున్నా అని జితేంద్రసింగ్ చెప్పారు.
Have gone into Self-Quarantine with immediate effect from 4 PM today, after receiving the news about #Corona positive test of J&K BJP President Sh Ravinder Raina who had accompanied us from Srinagar to Bandipora on 12th July.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 14, 2020